NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీ-20 వరల్డ్ కప్: కివీస్ లక్ష్యం 125 పరుగులు

1 min read



పల్లెవెలుగు వెబ్: టీ-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘన్ జట్టు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నజీబుల్లా జాద్రాన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మరో ఎండ్‌లో అతనికి అండగా ఎవరు నిలవకపోవడంతో ఆప్ఘన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే 1, జేమ్స్ నీషామ్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు.


About Author