గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోండి : జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా అందరికీ వైద్యం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు గ్రామస్థులకు సూచించారు.శుక్రవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో కుటుంబ డాక్టరు విధానంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షల కేంద్రాన్ని, గ్రామ సచివాలయం-1, గ్రామ సచివాలయం-2, జగనన్న కాలనీ లేఔట్ మరియు గోరంట్ల గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి బాఫూలే బిసి సంక్షేమ బాలుర వసతి గృహ పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ డాక్టరు విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకుగాను గ్రామాలలో కుటుంబ డాక్టరు విధానంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు గ్రామస్థులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా గ్రామస్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారన్నారు. గ్రామాలలోని ప్రజలకు జిల్లా కేంద్రాలకు వచ్చి వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ డాక్టరు విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. రక్తహీనత కలిగిన చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హైరిస్క్ గర్భవతులను వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో చేర్పించేలా ఆశా, ఎఎన్ఎం చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ డాక్టరు విధానంలో గ్రామంలోని అవ్వా, తాతలకు నిర్వహిస్తున్న కంటి పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించి వారికి అవసరమైన కంటి అద్దాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందికి సూచించారు.సచివాలయ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి వారికి అవసరమైన సేవలు అందించండిగోరంట్ల గ్రామంలోని గ్రామ సచివాలయం-1 మరియు గ్రామ సచివాలయం-2లోని హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ ప్రజలకు అందిస్తున్నా సర్వీసులను జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారానికి మూడు సార్లు పాఠశాలలు తనిఖీ చేస్తూ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. సంక్షేమ సిబ్బంది పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందేలా చూడాలన్నారు. మహిళ పోలీసులు పాఠశాలలో నిత్యం రెండు సార్లు పర్యటిస్తూ విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు పాఠశాలలో నాడు-నేడు ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. సచివాలయ సిబ్బంది విధులకు హాజరు అయినప్పుడు ఒకసారి సమావేశమై ఈరోజు చేయాల్సిన పనులపై చర్చించుకోవాలన్నారు. గతంలో విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తాసిల్దార్ కార్యాలయాలకు వెళ్లే వారిని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా సచివాలయాలోనే అందజేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించి అప్డేట్ చేసేలా చూడాలన్నారు. వాలంటీర్లు సచివాలయాలకు వచ్చినప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు.ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోండిగోరంట్ల గ్రామంలోని జగనన్న లేఅవుట్ కు సంబంధించి మంజూరైన ఇళ్ల నిర్మాణాలు గురించి జిల్లా కలెక్టర్ అడుగగా మొత్తం 66 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 28 ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాగా బిలో బేస్మెంట్ లెవెల్ – 10, బేస్మెంట్ లెవెల్ – 4, రూఫ్ లెవెల్ – 4, రూఫ్ కాంక్రీట్ – 1, పూర్తయిన ఇళ్లు – 9 అని హౌసింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూఫ్ లెవెల్, రూఫ్ కాంక్రీట్ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పూర్తైన ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందజేయాలన్నారు. కాలనీలకు అవసరమయ్యే త్రాగునీటి కేంద్రాలను పరిశీలించి కాలనీ వాసులకు అందజేయాలన్నారు. ఇళ్లకు అవసరమయ్యే విద్యుత్ మీటర్లును అందించారా లేదా అడుగగా ఉచితంగా విద్యుత్ మీటర్లను అందజేయడం జరిగిందని విద్యుత్ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాలు మొత్తం పూర్తి అయిన తరువాత రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయండిఅనంతరం గోరంట్ల గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి బాఫూలే బిసి సంక్షేమ బాలుర వసతి గృహ పాఠశాలను పరిశీలించి పదవ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంత మంది పరీక్షకు సిద్దం అవుతున్నారని ఇంఛార్జి ప్రిన్సిపల్ రయిజ్ అహ్మద్ అడుగగా మొత్తం 77 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. వారాలవారీగా పరీక్షలు నిర్వహించి పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో తాసిల్దార్ శేష్ఫణి, ఎంపిడిఓ చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ నాగరాజు, ఇంఛార్జి ప్రిన్సిపల్ రయిజ్ అహ్మద్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.