మన్ కీ బాత్ కాదు.. పెట్రోల్ ధరలపై మాట్లాడండి : దీదీ
1 min readపల్లెవెలుగు వెబ్ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. మన్ కీ బాత్ కాదు.. పెట్రోల్ ధరలు, వ్యాక్సిన్ గురించి మాట్లాడండి అంటూ విమర్శించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు లీటర్ 100 రూపాయలు దాటిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యాలు చేశారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన పన్నుల రూపంలో ప్రజల నుంచి 3.71 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బును ఏం చేశారని మోదీని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణ పై కాకుండా.. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం గురించి ఆలోచించాలని హితవు పలికారు. గ్యాస్ ధర 14 నెలల్లో 47 శాతం పెరిగిందని, ఉజ్వల పథకం ఏమయిందని ప్రశ్నించారు. రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కేంద్రం ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.