PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనార్టీ లపై చిత్తశుద్ధి లేని టిడిపి

1 min read

-టిడిపి నాయకులు అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లే

– అవినీతి చర్చపై ఏడు రోడ్లు ఎందుకు! పుత్త ఎస్టేట్లోనే తేల్చుకుందాం

– వైఎస్ఆర్సిపి నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు:  ఇటీవల తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు అందరూ కూడా అవినీతి కేసులలో కూరుకుపోయి జైలలో మగ్గుతుంటే, గల్లీలో ఉండే కొంతమంది టిడిపి పార్టీ నాయకులు వాటిని ప్రజలలో పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు మీద బురదజల్లే కార్యక్రమం చేపట్టడం జరిగిందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష అన్నారు, మంగళవారం ఆయన చెన్నూరులో మైనార్టీ నాయకులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీ లకు మంత్రి పదవిలో స్థానం కల్పించకుండా మైనార్టీలపై పక్షపాతం వహించడం జరిగిందన్నారు, అలాంటిది మైనార్టీలపై ఏదో కపట ప్రేమ నటిస్తూ నేడు మైనార్టీల జపం చేయడం జరుగుతుందని ఆయన ఆరోపించారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతిపై మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన మండిపడ్డారు, ఏదైనా మైనార్టీలకు లబ్ధి చేకూరిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, మళ్లీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే మైనార్టీలకు మేలు జరిగిందని ఆయన అన్నారు, గతంలో షాది తోపా అని మైనార్టీలకు ఏదో చేసినట్లు పాచిపోయిన సరుకులు అందించే వారని అలాంటి తోపాలకు మైనార్టీలు ముఖం వాచ్చి లేరని ఆయన అన్నారు, టిడిపి హయాంలో మైనార్టీలు ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు బలయించినప్పుడు ఈ నాయకులకు గుర్తుకు రాలేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, గతంలో షాది తోఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చేవారని, దానిని రెట్టింపు చేసి నేడు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా కరోనా సమయంలో కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ప్రతి ఇంటికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు, మరి కరోనా సమయంలో ఈ టిడిపి నాయకులు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదన్నారు, ఇండ్లు విడిచి బయటికి వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న నాయకుడే లేడని ఆయన మండిపడ్డారు, అలాంటిది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చి అసత్య ఆరోపణలు లేవనెత్తుతూ అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ సమస్య జరిగింది, అంటూ నాన గగ్గోలు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు, అవినీతి విషయంలో బహిరంగ చర్చకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఎవరు ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు, ప్రతి పనికి ముడుపులు తీసుకునే తెలుగుదేశం పార్టీ వారికి మా హయాంలో మేము ఇలా చేశాము కదా! అందరూ అలాగే ఉంటారు అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు, చెన్నూరు కనపర్తి లేఔట్లలోని జగనన్న కాలనీలలో 60 శాతం మైనార్టీలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని దేనని ఆయన అన్నారు, జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలు విషయంలో వారికి వారి అను చరులకు న్యాయం జరిగిందే తప్ప, మిగతా ఎవరికి సక్రమంగా పథకాల అందించారో టిడిపి నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు, అంతేకాకుండా నీరు చెట్టు, లోన్లు, హజ్ హౌస్ వంటి వాటిల్లో ఇష్టం వచ్చినట్లు కమిషన్లు తీసుకున్న బాపతి, మీది కాదా అంటూ ఆయన ప్రశ్నించారు, అలాగే సాయిబాబా థియేటర్, హరిప్రియ హోటల్, పుత్త ఎస్టేట్, వంటి వాటిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరన్నట్లు ఏడు రోడ్డు వద్ద చర్చకు ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, పుత్త ఎస్టేట్ లోనే చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము చర్చకు వస్తామని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు, 5 సంవత్సరాలు ప్రజల సమస్యలు పట్టించుకోని టిడిపి నాయకులు, ఎన్నికలు ముంచు కోచ్చే కొద్ది లేనిపోని ఆర్పాటాలు, ఆవేశాలతో ప్రజలకు ఏదో చేసినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, ఎంపీటీసీ సాదిక్ అలీ, మాజీ ఎంపీటీసీ మునీర్ అహ్మద్, అబ్దుల్ రబ్, ఉప సర్పంచ్ జుమన్, హస్రత్, తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author