టీచర్స్ డే బహిష్కరణకు ఉపాధ్యాయుల నిర్ణయం
1 min readపల్లెవెలుగువెబ్ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. సెప్టెంబర్ 5న ప్రభుత్వం చేసే సత్కారాలను , సన్మానాలను తిరస్కరించాలని ఏపీటీఎఫ్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్బంధాలు, రాత్రుళ్లు పోలీస్ స్టేషన్లలో ఉంచటం, అక్రమ కేసులు బనాయింపు, రెండు లక్షల పూచికత్తుతో బైండోవర్ కేసుల్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఉపాధ్యాయుల కదలికలపై నిఘా, సొంత ఫోన్లలో ఫోటోలతో హాజరు వేసే విధంగా ఒత్తిడిని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరించాలని నిర్ణయించాయి.