టెలివిజన్ ప్రీమియర్, సరికొత్త ధారావాహిక ఘరానా మొగుడు ప్రారంభం!
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్స్టాప్ వినోదంఅందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది.థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ సినిమా ‘రాబిన్హుడ్’ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభనువెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారంమాతృదినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ జీతెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈవారం ఫినాలేకి చేరుకుంది. అంతేకాదు కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్నసరికొత్త సీరియల్ ఘరానా మొగుడు ప్రారంభంకానుంది. యాక్షన్ఎంటర్టైనర్ రాబిన్హుడ్ ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు, డ్రామా జూనియర్స్ 8 మాతృదినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు,సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి 9గంటలకు, సరికొత్త ధారావాహిక ఘరానా మొగుడు మే 12న ప్రారంభం,సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!నితిన్, దేవదత్త నాగే, శ్రీలీల, వెంకీ కుడుముల దర్శకత్వంలో,నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈసినిమాలో నితిన్, శ్రీలీల, దేవదత్త నాగే,సిజ్జు, డేవిడ్ వార్నర్ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించినఈ యాక్షన్ ఎంటర్టైనర్ని మీరూ తప్పకుండా చూసేయండి. వారం వారం వినోదభరితమైన స్కిట్స్తో ప్రేక్షకులనుఆకట్టుకుంటున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మరో ప్రత్యేక ఎపిసోడ్తో వచ్చేస్తుంది.మాతృదినోత్సవం సందర్భంగా అనిల్ రావిపూడి తల్లి ఈ షోలో పాల్గొననున్నారు. మరి మీరూఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడండి. ఇక, ప్రతి శనివారం ఆటపాటలతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న జీతెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకు చేరకుంది. ఇక ఈఎపిసోడ్లో రోజా, మంచు లక్ష్మి పాల్గొని మరింత వినోదం పంచారు.అంతేకాదు! జీ తెలుగు మే 12న మరో కొత్త ధారావాహిక ఘరానామొగుడు ప్రారంభిస్తోంది. ఈ సీరియల్ కుటుంబం, ప్రేమ ముఖ్యనేపథ్యాలుగాతెరకెక్కుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు జీతెలుగులో ప్రసారమయ్యే ఘరానా మొగుడు సీరియల్ మిస్కాకుండా చూడండి!, ప్రతిభావంతులైననటీనటులు, ఆకట్టుకునే కథతో ఘరానా మొగుడు సీరియల్ జీ తెలుగువీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ సాయి, అక్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా,భావన, తేజల్, శరత్ చంద్ర, సుచిత్ర కీలక పాత్రల్లోకనిపించనున్నారు.