PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు సినిమా తార‌క ర‌త్నం జూ.ఎన్టీఆర్ : అమిత్ షా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన బాగుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నోవాటెల్‌ హోటల్‌లో అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. దాదాపు 11.10 గంటల సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత నోవాటెల్‌ నుంచి బయటికి వచ్చిన బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను అభినందించేందుకే ఈ భేటీ జరిగిందని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన తెలిపారు.

                                         

About Author