వైస్ చాన్సలర్ శ్రీ బసవరావ్ కు ధన్యవాదాలు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రొద్దుటూరు, నంద్యాల మెరిట్ విద్యార్థుల సన్మాన సమావేశాలకు ముఖ్య అతిధిగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీ ఉడుత వెంకట బసవరావ్ కు ఆహ్వానంమే 25 వ తేదీ ప్రొద్దుటూరు కేంద్రంగా పద్మశాలి అభ్యుదయ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమం టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధికముగా మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థిని, విద్యార్థులకు మెరిట్ అవార్డులు ఇవ్వనున్నారు. (ప్రొద్దటూరు పట్టణ పరధి లో నివసిస్తున్న పద్మశాలి విద్యార్థిని, విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం వర్తిస్తుంది). అదేవిధంగా జూన్ 1 వ తేదీ న కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం నంద్యాల పట్టణంలో టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధికముగా మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యారులకు మెరిట్ అవార్డులు ఇవ్వనున్నారు.ప్రొద్దుటూరు లో, నంద్యాలలో వేరు వేరు తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలకు కర్నూలులో ఉన్న రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీ ఉడుత వెంకట బసవరావ్ ను ఆయా సంఘాలు ముఖ్య అతిధి గా ఆహ్వానించాయి. కర్నూలులోని యూనివర్సిటీ కార్యాలయంలో వీ.సి. ని ప్రొద్దుటూరు పద్మశాలి అభ్యుదయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా వెంకట చంద్రబాబు, ట్రెజరర్ అవ్వారు శ్రీనివాసులు, సభ్యులు సోము జానకి రామయ్య, వద్ది ఉమా నరసింహులు, బోగా ఆనంద్, కోటా సంజీవరాయుడు, కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు భీమనపల్లె వెంకటసుబ్బయ్య, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘము ఉపాధ్యక్షులు పుత్తా రామకృష్ణ, జిల్లా సంఘం కార్యదర్శి శిరసాల రామచంద్రుడులు కలసి తమ సమావేశంలకు రావలెను అని విజ్ఞప్తి చేయడం జరిగింది. వైస్ చాన్సలర్ శ్రీ బసవరావు పద్మశాలి సంఘాల నాయకులను ఎంతో ఆప్యాయతతో పలుకరించి రెండు సమావేశాలకు తాను వస్తానని తెలియ చేశారు. ఈ సందర్బంగా వైస్ చాన్సలర్ కు సంఘాల నాయకులు ధన్యవాదములు తెలిపారు.