PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ పాత్ర లేనిదే.. నా పాత్ర లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్‌ఆర్‌ఆర్‌’విజయంపై ఎన్టీఆర్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో ఓ సుధీర్ఘ లేఖని విడుదల చేస్తూ.. పేరు పేరునా అందరికి ధన్యవాదాలు తెలిపాడు. రామ్‌ చరణ్‌ని పొగడ్తలతో ముంచేశాడు తారక్‌. అల్లూరి పాత్రని చరణ్‌ కంటే ఇంకా ఎవరు బెటర్‌గా చేయలేరని అభిప్రాయపడ్డాడు. చెర్రీ లేకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ని ఊహించుకోవడం కష్టమని తారక్‌ అన్నాడు. అల్లూరి పాత్రతోనే భీమ్‌ పాత్రకు పరిపూర్ణత చేకూరిందన్నాడు. జక్కన్న తన కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ ఇచ్చారని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. తనలోని గొప్ప నటుడిని వెలికితీసిన రాజమౌకి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే హీరోయిన్‌ ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య, సాంకెతిక నిపుణులు, మీడియాకి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక లేఖ చివర్లో తన అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాడు. తనపై చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. ఇంకా ఎన్నో మంచి సినిమాలతో అలరిస్తానని తన అభిమానులకు వాగ్దానం చేశాడు.

                                                  

About Author