ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆ జీవో వర్తించదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అవకాశం కల్పించమని ఇటీవల రాజమౌళి సీఎం జగన్ ని కలిశారు. దీని పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘‘దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100 కోట్లు వ్యయం దాటితే.. సినిమా విడుదలైన పదిరోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉందని జీవో నం: 13లో తెలిపాం. అందులో భాగంగానే రాజమౌళి దర్శకత్వవ వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి టికెట్ ధరల పెం,మని కోరుతూ వినతి పత్రం అందింది. జీఎస్టీ, పారితోషికాలు కాకుండా చిత్రానికి రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు చిత్ర బృందం ఇచ్చిన వివరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపిస్తాం. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ప్రత్యేక టికెట్ ధరలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జీవో రావడానికి ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చితాన్ని నిర్మించారు కాబట్టి రాష్ట్రంలో 20 శాతం షూటింగ్ నిబంధన ‘ఆర్‌ఆర్‌ఆర్’కు వర్తించదు. కొత్తగా నిర్మించే చిత్రాలకు కొత్త జీవో నిబంధనలు వర్తిస్తాయి’’ అని తెలిపారు.