పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్ పక్వాడ లక్ష్యం
1 min read
పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించండి
జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య
కర్నూలు, న్యూస్ నేడు: పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యం అని జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమని నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు మరియు ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే తల్లులు వారి ఆరోగ్యం పట్ల వహించాల్సిన శ్రద్ధ, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సరైన చర్యలు గురించి అవగాహన కల్పించడమే పోషణ పక్వాడ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు… జిల్లా, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు.. గర్భవతులు రక్తహీనతకి గురి కాకుండా అవసరమైతే ఐరన్ ఫోలిక్ యాసిడ్ ను సప్లిమెంట్ గా తీసుకోవాలన్నారు. అదే విధంగా ట్రైమెస్టర్ లో తీసుకోవాల్సిన ఇంజెక్షన్ సరైన సమయానికి చేయించుకోవాలన్నారు… డెలివరీ అయిన తర్వాత 3 నెలల వరకు పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలని, సంవత్సరం లోపల ఉండే పిల్లలకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు… 3 ఏళ్ల పాటు పిల్లల గురించి వారికి ఇవ్వాల్సిన న్యూట్రీషన్లు గురించి అవగాహన ఉండాలన్నారు.. పిల్లలకు జంక్ ఫుడ్ లాంటివి అలవాటు చేయకుండా చిరుధాన్యాల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం చేసి పిల్లలకి పెట్టాలన్నారు… రాష్ట్ర ప్రభుత్వం గర్భవతులకు పోషన్ ట్రాకర్ ద్వారా టేక్ హోమ్ రేషన్ కిట్లను కూడా ఉన్నారన్నారు.0 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని, ఆరోగ్యశాఖ ఐసిడిఎస్ శాఖ సమన్వయంతో కలిసి పనిచేసి బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లు ఇప్పించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు… అంగన్వాడి కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ కి వచ్చే పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ ఉందో లేదో వెరిఫై చేయాలన్నారు.. అదే విధంగా గర్భవతుల రిజిస్ట్రేషన్ పోర్టల్ లో రిజిస్టర్ అయిన వారికి సర్టిఫికెట్ అందిందో లేదో కూడా వెరిఫై చేసుకోవాలని కలెక్టర్ డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు.ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్జెడి రోహిణి మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలని శక్తి వంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు . పిల్లలకు చక్కెర , మైదాపిండి , చాక్లెట్ లు లేని మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని , వారు ఒబిసిటీ కి చేరుకోకుండా చర్యలు తీసుకోవాలని తద్వారా వారిని శక్తివంతులుగా తయారు అవతారన్నారు. గర్భవతులు ఆహార నియమాలను పాటిస్తూ అంగన్వాడి కేంద్ర ఆహారాన్ని తీసుకోవాలని , తగిన వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. ఐ సి డి ఎస్ పిడి నిర్మల మాట్లాడుతూ ఈనెల 8వ తారీఖు నుండి 22 తేదీ వరకు జరుగుతున్న పక్షం రోజుల పోషణ్ పక్వాడ అవగాహన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు తమ ఆరోగ్యం కొరకు ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాలు, సూచనలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. గర్భవతి నుండి రెండు సంవత్సరాల శిశువు అయ్యేంతవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల సంరక్షణ చేయాలని అవసరమైన వైద్య సలహాలు తీసుకోవాలని మరియు పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలని సూచించారు.డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతులు , బాలింతలు సరైన అవగాహన లేక అనారోగ్యాలు పాలవుతున్నారని వారు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కిచెన్ గార్డెన్ పై డిఆర్డిఏ సిబ్బంది అవగాహన కల్పిస్తారని దానిని వినియోగించుకుని గర్భవతులు, బాలింతలు ప్రకృతి వ్యవసాయం ద్వారా వారికి కావలసిన రసాయనాలు లేని పోషక ఆహారాన్ని పండించుకోవాలని తెలిపారు.డిఎంహెచ్ఓ శాంతి కళ మాట్లాడుతూ గర్భవతులు మరియు బాలింతల కు కావలసిన ఐరన్ సప్లిమెంట్లు, టీకాలు, మందులు, ఆరోగ్య సూచనలు ఆశా వర్కర్లు , ఏఎన్ఎం ల ద్వారా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేసే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. తల్లిపాల ఆవశ్యకతను తెలుసుకొని పిల్లలకు 6 నెలల దాకా తల్లిపాలు తప్పక ఇవ్వాలని సూచించారు. వెయ్యి రోజులు వరకు పిల్లలను వారి పెరుగు దల ను నిశితంగా గమనించాలని అవసరమైతే వైద్యులను సంప్రదించాలని కోరారు.అంతకుముందు మిల్లెట్ లతో తయారు చేసిన పౌష్టిక ఆహార పదార్థాల ప్రదర్శన స్టాల్స్‌ను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిడిపీఓ లు తదితరులు పాల్గొన్నారు.
