నగరపాలక పిఆర్వో బదిలీ…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరపాలక సంస్థ పిఆర్వోగా పనిచేస్తున్న కే.యల్.యన్. రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపాలిటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి యస్.సురేష్ కుమార్ మంగళవారం జీవో నెంబర్ 303 విడుదల చేశారు. కాగా ఇప్పటికే ఆయన నందికొట్కూరు, డోన్, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు కమిషనర్గా పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్లో కర్నూలు నగరపాలక సంస్థకు వచ్చిన ఆయనను మంగళవారం పొదిలి మున్సిపాలిటీకి ప్రభుత్వం బదిలీ చేసింది.

