NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భగవద్గీత  ప్రపంచ సాహిత్యంలో సాటిలేని గ్రంథం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

మల్లాపురం నందు ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రపంచ సాహిత్యంలో సాటిలేని గ్రంథం భగవద్గీత అని, శోకమయమైన జీవునికి శాశ్వతమైన ఉపశమనం కలిగిస్తుందని, కులమతాలకతీతంగా భగవద్గీతను అధ్యయనం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండలం, మల్లాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ప్రారంభమైన ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించేశారు. తదనంతరం ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. తదనంతరం స్థానిక భజన మండలిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యం.భాగ్యమ్మ, యం.రాఘవేంద్రా రెడ్డి, బి.సోమేశ్వర రెడ్డి, అర్చకులు నంబి చెన్నకేశవులు, తిమ్మప్ప , భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author