అంగరంగ వైభవంగా జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పవిత్ర తంగభద్ర నది తీరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ముందు ఈరోజు శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతి మరియు ధర్మోపనయనాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం ఎనిమిది గంటలకు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహానికి అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం వచ్చిన వటువులందరూ కూడా పద్ధతి ప్రకారం కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వేదపండితులు కమల సాయి పురోహిత శ్రేష్టుడు శ్రీ కోదండ రామశర్మ బృందం నిర్వహించిన ఋగ్వేదం యజుర్వేదం, ఉపనయన కార్యక్రమం , అలాగే కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వారు చేసిన ఏర్పాట్లు ,బోజన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అని హాజరైన 300లకు పైగా జనం మెచ్చుకొన్నారు , దానికి స్పందిస్తూ అధ్యక్షుడు సండెల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరి సహకారం ఉంటే ప్రతి ఏడు రంగరంగా వైభవంగా ఉపనయన కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు కార్తీక వనభోజనాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అన్నారు అలాగే శ్రీ టీజీ వెంకటేష్ సహాయ సహకారాలతో దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ కళ్యాణాలు కూడా చేసుకునే దానికి ఆలయ ప్రాంగణం బాగా విశాలంగా తయారు చేసుకోబోతున్నాం అని అన్నారు, ఈ కార్యక్రమంలో దాదాపు పది మంది వటువులు ఉపనయనం చేసుకున్నారు 300 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు బ్రహ్మశ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ విశ్రాంత పోస్టల్ సూపర్డెంట్ శ్రీ కె వి సుబ్బారావు మరియు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ నవీన్ హాజరయ్యారు , ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులు ప్రధాన కార్యదర్శి చల్లా నాగరాజ్ శర్మ ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యాంసుందర్ శర్మగారు సలహాదారులు శ్రీ టీవీ రవిచంద్ర శర్మ శ్రీమతి కృష్ణజ్యోతి , శ్రీనివాస రాజు , ఆనందరావు రాధాకృష్ణ , శివన్న , ప్రధానార్చకుడు ప్రసన్న స్వామి, మహేష్ , గురు రాజారావు, శ్రీమతి జయలక్ష్మి శ్రీమతి సీతాలక్ష్మి శ్రీమతి భార్గవి శ్రీమతి గాయత్రి శ్రీమతి హిమబిందు ,, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.