NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి

1 min read

బస్టాండ్ లో ప్రయాణీకులకు  తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి

రెండు ప్లాట్ ఫామ్ లకు ఒక  మినరల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయండి

టాయిలెట్ లను శుభ్రంగా ఉంచాలి 

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు:  బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా   చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ను ఆదేశించారు.గురువారం సాయంకాలం స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను, పార్కింగ్ ను, హోటల్ లను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఎంట్రన్స్ వద్ద ఉన్న హోటల్ కి వచ్చినవారు వాహనాలను ఎలా పడితే అలా పార్కింగ్ చేయకుండా  తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు.. బస్టాండ్ పరిసరాలలో పరిశుభ్రత లేదని,  పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్టేషన్ మేనేజర్ ను ఆదేశించారు.. బస్టాండ్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న ప్రయాణికురాలుతో మాట్లాడుతూ మీరు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా??  నంద్యాల కి వెళ్లాలని సమాధానం ఇస్తూ తనకి నంద్యాల వెళ్లే బస్సు  ఏ ప్లాట్ ఫామ్ లో ఉంటుందని తెలియదని కలెక్టర్ కి వివరించారు.. చదువురాని ప్రయాణికుల కొరకు వారు వెళ్లాల్సిన బస్సు ఏ ప్లాట్ ఫామ్ లో ఉందని తెలియజేసే విధంగా ఒక మార్గదర్శకుని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టిసి ఆర్ఎం ను ఆదేశించారు..  అదే విధంగా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా  కర్నూల్ మున్సిపల్ కమిషనర్  ద్వారా చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు.ప్రయాణికులకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా రెండు ప్లాట్ ఫామ్ లకు కలిపి ఒక మినరల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు.బస్టాండ్ లో ఉన్న ఉచిత మినరల్ వాటర్ ఛాంబర్ ను పరిశీలిస్తూ ఈ విధంగా అపరిశుభ్రతగా ఉంటే ఏ ప్రయాణికుడూ నీళ్లు తాగరని, కనీసం ట్యాప్ లు కూడా సరిగ్గా లేవని, వీటిని సరైన రీతిలో మైంటైన్  చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను,  ఈఈ ని ఆదేశించారు.బస్టాండ్ ప్లాట్ ఫామ్ లో పైకప్పు పెచ్చులు ఊడడం గమనించిన కలెక్టర్ వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ ఈఈ ని ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *