ముఖ్యమంత్రి కురువలకు ప్రత్యేక ఫేడరేషన్ ఏర్పాటు చేయాలి…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న……. గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్న కురువ కులస్థుల మొర ఆలకించండని కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి రంగస్వామి తమ కులానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాష్ట్రంలో 35 లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ కురువ కులస్థులకు రాజకీయ ప్రాధాన్యత లేదు. గోర్రేల కాపరులు గోర్రేలు మెపుకునేందుకు కూడా నేటికీ కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తందారులు అధికారులు మా పైన పెత్తనం చెలాయిస్తూ అంటరాని వారుగా చూస్తూన్నారు. గోర్రేలు,మేకలు 100% సబ్సిడీపై (పిఎంఅర్ వై) కింద ఇవ్వాలని ప్రతి గ్రామంలో గొర్రెలు మేపేందుకు భూమి కేటాయించాలి, ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలి. కుల సర్టిఫికెట్ల మంజూరులో ఎలాంటి సౌలభ్యం కల్పించడం లేదు. వానా కాలంలో గొర్రెలు ఉంచుకునేందుకు షెడ్లను 90% సబ్సిడీపై మంజూరు చేయాలి. ప్రతి గొర్రెల కాపరికి ఇల్లు మంజూరు చేయాలి,అలాగే గొర్రెలు, మేకల కాపలాదారులకు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు ఆయుధాల లైసెన్స్ మంజూరు చేయాలి. ఉన్ని పరిశ్రమకు ప్రభుత్వము హబ్ ఏర్పాటు చేయాలి, ఇటీవల కాలంలో గొర్రెల దొంగతనాలు పేరుగుతున్నప్పటికీ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం లేదు,చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కురువ విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్లు మంజూరు చేయాలి. ప్రమాద భీమా పథకం కింద గోర్రేల కాపరులకు పది లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కురువ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గోర్రేల కాపరుల ఫేడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.