పెద్ద నోట్ల చెలామణి తగ్గింది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు చెలామణి మరింత తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల సంఖ్య 214 కోట్లకు పడిపోయింది. ఆ సమయానికి మార్కెట్లోని అన్ని డినామినేషన్ నోట్లలో రూ.2,000 కరెన్సీ వాటా ఏకంగా 1.6 శాతానికి తగ్గింది. వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 మార్చినాటికి వ్యవస్థలో చలామణి అవుతున్న అన్ని డినామినేషన్ నోట్ల సంఖ్య 12,437 కోట్లుగా నమోదు కాగా.. 2022 మార్చి నాటికి 13,053 కోట్లకు పెరిగింది. 2020 మార్చి నాటికి 274 కోట్ల రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అప్పటికి చలామణిలో ఉన్న అన్ని డినామినేషన్ నోట్లలో వీటి వాటా 2.4 శాతంగా ఉండేది. 2021 మార్చి నాటికి 245 కోట్ల రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా.. మొత్తం కరెన్సీలో వాటా 2 శాతంగా నమోదైంది.