నాటు సారా నిర్మూలన కార్యక్రమం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నవోదయము కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలన కార్యక్రమం తో పాటు కేర్ వ్యసన విముక్తి కలిగించే కార్యక్రమం పశువుల గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్జీవోలు హాజరైనారు. కేర్ కమిటీకి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు ఆర్ హనుమంతరావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాజశేఖర్ గౌడ్, ఎన్జీవోస్ రాజేంద్రప్రసాద్ మరియు షరీఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్, ఎస్సై లు నవీన్ బాబు, వెంకటరాజు మరియు సిబ్బంది వెంకటేశ్వర్లు నందీశ్వర్ రెడ్డి రామలింగయ్య చంద్రపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామస్తులను ఉద్దేశించి మద్యపాన వ్యసన విముక్తి కార్యక్రమాలు చేయడమైనది.నాటు సారా మరియు మద్యం సేవించడం వల్ల వచ్చు అనర్థాల గురించి మరియు వాటి ని సేవించడం వల్ల ఆరోగ్యం పై చూపేటటువంటి ప్రభావం వీటన్నింటినీ చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి రెండవ శనివారము మరియు నాలుగో శనివారము ఈవ్యసన విముక్తికై ఒక కార్యక్రమం పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి నాటుసారా తయారీ మానుకున్న వారికి వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేయడమైనది కావున అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా తెలియజేయడమైనది.