నెరవేరనున్న భక్తుల చిరకాల స్వప్నం…
1 min read
అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి ఆలయంలో భోజనశాల నిర్మాణంకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేడు శ్రీకారం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అప్పన వీడు అభయాంజనేయ స్వామి ఆలయంలోభోజన శాల నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.35 లక్షలు కేటాయిస్తాం, త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతాంమని హామీ ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. అన్న క్యాంటీన్ సైతం ఏర్పాటు చేస్తామనీ.అదే విధంగా దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ నిధులు కేటాయిస్తూ తొలి కార్యక్రమం అప్పన్న వీడు అభయాంజనేయ స్వామి వద్ద నుంచి ప్రారంభించటం ఎంతో సంతోషదాయకం. దెందులూరు నియోజక వర్గ అభివృద్దికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహకారం ఎంతో అభినందీయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి అభయాంజనేయ స్వామిని ఏలూరు ఎంపీ దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పన్న వీడు లోని ప్రముఖ ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. స్థానిక పెదపాడు మండల కూటమి నాయకులు మరియు భక్తుల విజ్ఞప్తి మేరకు అభయాంజనేయ స్వామి ఆలయంలో రూ. 35లక్షల రూపాయల ఎంపీ నిధులతో భోజనశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అప్పన్నవీడులో కొలువైన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీకి, ఎమ్మెల్యే ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాలను ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అందజేశారు. అనంతరం ఆలయం సమీపంలో భోజనశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎంపీ , ఎమ్మెల్యేలు సందర్శించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.35 లక్షలు భోజనశాల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు భక్తుల హర్షద్వానాల నడుమ ఎంపీ పుట్టా మహేష్ ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి భోజన శాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. భోజనశాలకు సౌర శక్తితో విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారని తెలిపారు. అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ నిధుల నుంచి తొలి అభివృద్ధి పనులను అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభిస్తున్నారని, దీనికి ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. భోజనశాలతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనంతరం భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్, నియోజకవర్గ సీనియర్ నాయకులు గారపాటి రామ సీత, తాత సత్యనారాయణ, సహా మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), బొప్పన సుధా, నంబూరు నాగరాజు, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి దశరథ్, క్లస్టర్ ఇంచార్జీ గుత్తా అనిల్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, సహా కూటమి నాయకులు కమ్మ శివరామకృష్ణ, మండల కార్యదర్శి మందపాటి వేంకటేశ్వర రావు, కొనకళ్ళ శివమణి గౌడ్, బొడ్డేటి మోహన్, జమలయ్య, గరికపాటి చంటి, ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు వడ్డీ వాసవి దేవి, ఆలయ కమిటీ నిర్వాహకులు వేమూరి శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు బెక్కం లక్ష్మి నారాయణ, మాజీ ఎంపీటీసీ బెక్కం శ్రీనివాసరావు, మట్టా శ్రీనివాస్, సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
