48వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు
1 min read
5వ రోజు శివ గోపాల్ నగర్ లో పండుగ వాతావరణంలా కార్యక్రమం
డివిజన్ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే బడేటి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం 5వ రోజు స్థానిక 48 వ డివిజన్ తంగెళ్ళమూడి శివగోపాలపురం లో పండగ వాతావరణం లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరణలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నాకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పార్ధ సారధి, ఈడా చైర్మన్ ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు వెంకటరత్నం, 48 వ డివిజన్ కార్పొరేటర్ నున్న స్వాతి, క్లస్టర్ ఇన్చార్జి వందనాల శ్రీనివాస్ ఆర్నెపల్లి తిరుపతి మాగంటి హేమ సుందర్, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
