సుపరిపాలనకు తొలి అడుగు…
1 min read
ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఏనుగు మర్రి ,ప్యాపిలి,పోతుదోడ్డి,గుడి పాడు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి వెళ్లి మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకున్నారు . ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రానికి ఏం చేశారు అనే విషయాలను, భవిష్యత్తులో ఏమేమి చేస్తారో కూడా వివరించారు. ఈసందర్భంగా వారు ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించారు. సిఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో సంక్షేమంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకు ఏడాదికి 34వేల కోట్లు అవుతుందన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా
1) తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు ఇప్పటికే నగదు జమ చేశామన్నారు.
2) దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము.
3) 16,347 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది
4)ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని
5)ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు వేస్తామన్నారు.
6)రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5లకే పేదవాడి ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వర రావు యాదవ్, టిడిపి సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మీ రెడ్డి, బత్తుల రామెశ్వర రెడ్డి, ఖాజా ఫీర్, చండ్రపల్లె లక్ష్మి నారాయణ యాదవ్, మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు , ప్యాపిలి తేదేపా నాయకులు రాజు నారాయణ మూర్తి, రాజా రవి, ఎస్ కె వలి,చల్లా వీర, ప్రిన్సిపాల్ మధు, కొంగనపల్లి మధుఏనుగు మర్రి తేదేపా నాయకులు రామకృష్ణ,రాము, శివశంకర్,పోతుదోడ్డి టిడిపి నాయకులు పుల్లారెడ్డి,కదిరప్ప, నారాయణ, గుడిపాడు టిడిపి నాయకులు వెంకట రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
