కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి
1 min read

వామపక్షాలు, కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం
పత్తికొండ , న్యూస్ నేడు : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల 60 వేల కోట్లు కేటాయించాలని, 200 పని దినాలు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, ప్రాథమిక అవసరంగా అన్ని గ్రామీణ కుటుంబాలకు గృహ నిర్మాణం కల్పించాలని,భూమిలేని గ్రామీణ పేదలకు కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, పేదలకు ఆహార భద్రత కల్పించాలని, రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, స్మార్ట్ మీటర్లు ఉపయోగించే విధానం తీసివేయాలని, గిరిజన, దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని, కార్మికులకు తీసుకొస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు ఉరితాళ్లుగా మారుతున్న మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కౌలు రైతులకు చట్టం చేసి భద్రత కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు, పేదలకు,కౌలుదారులకు నెలకు 10 వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, డిమాండ్ చేస్తూ వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా దేవనకొండ లో అంగన్వాడి, ఆశ, హమాలి, ఆటో,రైతు, వ్యవసాయ కూలీలతో కలిసి హార్తల్ కార్యక్రమాన్ని ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకులు ఎం. నరసరావు,ఎం.అశోక్ అధ్యక్షతన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు దాదాపు గంటసేపు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.వారిని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. మద్దిలేటి శెట్టి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్, ఏపీ కౌలు రైతు సంఘం.

