డాక్టర్ ల సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ ల సమస్య తీర్చిన ప్రభుత్వం..
1 min read
పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్…
కర్నూల్, న్యూస్ నేడు: జిల్లాలోని డాక్టర్ల సర్టిఫికెట్ రెన్యువల్, రీ-రిజిస్ట్రేషన్ మరియు ఇతర సేవల కొరకు జిల్లాలోనే రిజిస్ట్రేషన్ యూనిట్ ఏర్పాటు చేసి డాక్టర్ ల రిజిస్ట్రేషన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శనివారం ఉదయం కర్నూలు మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన డాక్టర్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ యూనిట్ ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడు ప్రజలకు మంచి చేయాలి అని నూతనంగా ఆలోచించే స్వభావం కలవారు. దానిలో భాగంగా ప్రజలకు 500 సర్వీసులతో వాట్సాప్ గవర్నెన్స్ ను అభివృద్ధి చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు వారి సర్టిఫికేట్ ల రిజిస్ట్రేషన్ లు, రీ- రిజిస్ట్రేషన్ లు మరియు ఇతర సేవలను ఎక్కడికక్కడ జిల్లాలో చేయించే ఏర్పాట్లు చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ల కొరకు విజయవాడకు వెళ్ళవలసి వచ్చేది, విజయవాడకు వెల్లడము, ఏదైనా సర్టిఫికెట్ తక్కువ అయితే తిరిగి వెనక్కి రావడం చాలా శ్రమతో మరియు ఖర్చు తో కూడుకున్న వ్యవహారం, డాక్టర్ తమ విలువైన సమయం వెచ్చించడం 60 సంవత్సరాలు పై బడ్డ డాక్టర్లకు ఇంకా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాల నుండి డాక్టర్లను విముక్తి చేశారు. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధమైన ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడికల్ కౌన్సిల్ను అభినందించారు.గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరి ఇండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినర్సమ్మ లు మాట్లాడుతూ… డాక్టర్లకు ఈ విధమైన మంచి అవకాశం కల్పించిన మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశానికి కళాశాల ప్రొఫెసర్ లు పాల్గొన్నారు.