NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవ సమాజంలో.. మూఢ నమ్మకాలా..!

1 min read

సైన్స్​ పరిశోధనలను ప్రోత్సహించండి..

  • తెలంగాణ జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు డాక్టర్ ఎల్ మురళీధర్

కర్నూలు, న్యూస్​ నేడు: భిన్నత్వంలో ఏకత్వం ఉండే గొప్ప దేశం భారతదేశం అని ఈ దేశంలో ప్రతి పౌరుడు భద్రంగా ఉండాలంటే గాంధీ, అంబేద్కర్, మార్స్ భావజాలాలు నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయో పరిశోధన చేసి ఉపయోగించుకోవాలని తెలంగాణ జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు డాక్టర్ ఎల్ మురళీధర్ పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూల్ నగరంలోని హార్ట్ ఫౌండేషన్ సమావేశం మందిరం యందు వేదిక 18 వ జిల్లా మహాసభలు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సందర్బంగా డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలు ఇంకెంతకాలమని ఇకనైనా సైన్స్ పరిశోధనలకు ప్రభుత్వాలు నిధులు కేటాయించి ప్రోత్సహించాలని కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ సైన్స్ ను ఉపయోగించుకునే మూఢ నమ్మకాల ప్రచారం చేస్తున్నారని నిత్య జీవితం లో సైన్స్  ఒక భాగం అని తెలిపారు. సైన్స్ నిత్య నూతనంగా నూతన ఆవిష్కరణ లకు శ్రీకారం చుడుతుంటే మన జనం మాత్రం మూడ నమ్మకాలని నమ్మకం పేరుతో ప్రచారం చేస్తున్నారని అన్నారు.  ప్రతి వ్యక్తి కి సమాజం ఎంతినిచ్చిది అని కావున ప్రతి ఒక్కరూ సమాజం కోసం పని చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సమాజం కోసం పనిచేసే వారికి జన విజ్ఞాన వేదిక తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అన్నారు. రాయలసీమలో సాగు త్రాగునీటి సమస్య ఎంతో నిగూఢంగా ఉందని సామాజిక బాధ్యత ఉన్న ప్రతి పౌరుడు ఈ సీమ నీటి విషయంలో అవగాహన కలిగి ఉండాలని సీమ వాసిగా నీటి ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకపోతే రాబోయే కాలంలో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, ఇప్పటికే పక్షిమ ప్రాంత ప్రజలు త్రాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా  ప్రజలు చైతన్యవంతం కావాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు శ్రీ బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు . క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అండ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అఖ్తర్ బాను మాట్లాడుతూ సమాజంలో మహిళలు ముందుండి పోరాటం చేయాలని సమాజ మార్పుల స్త్రీల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైన తెలిపారు.  డైట్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యా బోధన మరియు మార్గదర్శకాలు అనే అంశంపై మాట్లాడారు. అనంతరం రాయలసీమ సాగునీటి సమస్యలపై నాలుగు తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకులు మహమ్మద్ మియా జిల్లా అధ్యక్షులు నాగరాజు ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి రాష్ట్ర నాయకులు శేషాద్రి రెడ్డి, సుదీర్ రాజు,యాగంటేశ్వరప్ప బాషా, కె.సి.రాముడు, సుజాత, ధనుంజయ్, దామోదర్, రామ లక్ష్మణ్, శ్రీరాములు, వీరేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author