రబి సీజన్లో నష్టపోయిన వేరుశనగ మిరప రైతు లను ప్రభుత్వం ఆదుకోవాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: రబి సీజన్లో తుఫాన్ , వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి లేక తీవ్ర నష్టాలకు గురైన వేరుశనగ, మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎంజిల్లానాయకులు బి. వీర శేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు దేవనకొండ వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, ఏవోకి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు యూసుఫ్ భాష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వీరశేఖర్ అశోక్ లు మాట్లాడుతూ, రబీ సీజన్లో ప్రారంభం నుండి వరుసగా వాతావరణ పరిస్థితుల అననుకూలత నేపథ్యంలో అదేవిధంగా తుఫాన్లు ప్రభావంతో వేరుశనగ మిరప ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎకరాకు వేరుశనగ మూడు నుంచి ఐదు బస్తాలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులు మాత్రం వేలకు వేలు ఉంటున్నాయని నేపథ్యంలో రబీ సీజన్లో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు,ప్రభుత్వం వెంటనే దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. నష్టపోయిన వేరుశనగ, మిరప రైతులకు ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ సంస్థల అధిపతులకు వేల కోట్ల రూపాయల మాఫీ చేసే ప్రభుత్వ పెద్దలు రైతుల దగ్గరకు వచ్చేసరికి లాభనష్టాలు లెక్కేసుకుంటున్నారని దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల బాధలు ఉండడం దేశానికి మంచిది కాదని రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు ఆ పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాయుడు, బలరాముడు, వీరన్న, సూర్యచంద్ర, బిస్మి , తదితరులు పాల్గొన్నారు.