PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

120 గోర్రెపిల్లల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి

1 min read

– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: ఉమ్మడి అనంతపురం జిల్లా కంబదూరు మండలం లోని ఎగువపల్లి గ్రామానికి చెందిన గొల్ల బడప్ప,కురుబ రాము,కురుబ రంగా రెడ్డి అనే గొర్ల కాపర్లకు సంబంధించిన దాదాపు 120 గొర్రె పిల్లలు. గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చింత చెట్టుకింద ఉన్న ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో , ఆ మంటలు వ్యాప్తి చెందడంతో గొర్రె పిల్లలన్నీ కాలి బూడిద అయ్యాయని కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సుమారుగా ఐదు లక్షల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయాలని కోరారు . ఈ విషయమై సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి బాధిత గొర్రెల కాపర్లకు జరిగిన నష్టం పై విచారించి,న్యాయం జరిగేలా సత్వర చర్యలు చేపట్టాలని గుడిసె శివన్న కోరారు. ఈ లాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని రాష్ట్రంలో ఉన్న గోర్రెలు మేకలకు ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కురువలు ప్రదాన వృత్తి గోర్రెల కాపరులం గోర్రెలు రొడ్డు యాక్సిడెంట్. నీటమునిగి చనిపోయినప్పుడు మరియు రైలు ప్రమాదం పిడుగుపాటు గురై మృతి చెందిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. కావున ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా గోర్రెల కాపరులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కోరారు.

About Author