NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానీయుడు శ్రీ భక్త కనకదాసు…

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో శ్రీశ్రీ భక్త కనకదాస్ 538 వ జయంతి సందర్భంగా శ్రీ శ్రీ భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు  విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించిన సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ మాట్లాడుతూ విద్యార్థులు మహానీయుడు శ్రీ భక్త కనకదాసు ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులు ఈ సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని అలాగే డాక్టర్ భరత్ కుమార్  మాట్లాడుతూ ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమైన దశని మన ఇంటర్మీడియట్ లోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని తల్లిదండ్రులకు కళాశాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అందరు కూడా సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాధసి కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కాలిక ప్రసాద్,సలహాదరుడు కొగిలాతోట శేషప్ప,డా.  రామాంజి,ఈసా, చిదానంద సారు,ఈరప్ప, పంపాపతి, దిడ్డి వెంకటేష్, కాకి పకీరప్ప,కృష్ణయ్య,జాకిర్, లక్మన్న,మంజు,సీఐటీసీ నాగరాజ్, గర్జప్ప, ఆనంద్, కృష్ణ వేణు,ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్, సంఘం నాయకులు  ఎస్​కె గిరి, గదిలింగప్ప,మల్లయ్య, గది,రాంకోటి, తదితరులు పాల్గొన్నారు.

About Author