రాష్ట్ర స్థాయి ఈవెంట్స్ లో గెలుపొందిన వారికి మంత్రి మెడల్స్ అందజేత
1 min read
పల్లెవెలుగు కర్నూలు: ఈ నెల రెండో తారీఖున మంగళగిరిలో 6 బెటాలియన్ గ్రౌండ్లో పారాస్పోర్ట్స్ అసోసియేష ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఈవెంట్స్ జరిగాయి ఈ ఆటలు పోటీల్లో కర్నూలు జిల్లాకు 11 గోల్డ్ మెడల్ 8 సిల్వర్ మెడల్ 3 బ్రాంచ్ మెడల్స్ కర్నూలు జిల్లాకు రావడం జరిగింది .ఆ మెడల్స్ ని ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పారిశ్రామిక ఆహార శుద్ధి వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్ చేతుల మీద మెడల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా వారి చేతల మీదుగా పంపించడం జరిగింది. వారి సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరు తెస్తూ రేపు జాతీయస్థాయిలో నిర్వహించే ఆటలు పోటీల్లో రాష్ట్రానికి ప్రథమ స్థానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలని ఉపయోగించుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ నెల 17వ తారీకు నుండి 20వ తారీకు వరకు చెన్నైలో నిర్వహించే జాతీయస్థాయి ఆటలు పోటీలకు కర్నూలు నుండి గౌతమ్, సాయామర్నాథ్, గణేష్, దినకర్, శివాని మొదలగు ఐదు మంది సభ్యులు ఎన్నికయ్యారు వారు ఈరోజు కర్నూల్ నుండి బయలుదేరి చెన్నైకి చేరుకుంటున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా గౌరవనీయులు మంత్రివర్యులు శుభాభివందనాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టీఫెన్ హాకింగ్ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు విభిన్న ప్రతిభావంతులను క్రీడాల ప్రోత్సహించడానికి ప్రత్యేక బడ్జెట్లు కేటాయించి ఈనెల ఆరో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా 11 మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక్క కోటి 25 లక్షలు జాతీయస్థాయిలో రాణించిన వారికి ఇవ్వడం జరిగిందని ఈ ప్రోత్సాహంతోనే మిగతా క్రీడాకారులు కూడా జాతీయస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రోత్సాహాలని పొందాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ప్రధాన కార్యదర్శి రాజు మరియు కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు కుమ్మరి మద్దిలేటి సహాయ కార్యదర్శి మక్బూల్ బాషా కోశాధికారి సురేష్ నాయుడు ఉద్యోగస్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణుడు మరో ఉపాధ్యక్షులు కే కృష్ణ జిల్లా స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు గణేష్ దినాకర్ రేణు మదన్మోహన్ మరియు మొదలగు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.