PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం చేతిలో పేదవాళ్లు నలిగిపోతున్నారు

1 min read

– దేవస్థానాలను వదలడం లేదు ,దేవస్థానం భూములను వదలడం లేదు వైసీపీ నాయకులు

– బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  భూకబ్జాలు చేయడానికి వైసీపీ నాయకులు పదవులు చేపట్టారని సీనియర్ నాయకులు, రాయలసీమ స్టీరింగ్ కమిటీ, మాజీ ఎమ్మెల్యే చైర్మన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం నాడు మండలంలోని దుర్విషీ గ్రామంలో జరిగిన చెన్నకేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం నాగభూపాల్ రెడ్డి స్వగృహంలో పత్రికలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ నుండి చాలామంది ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ రాయలసీమకు తీరని అన్యాయం చేశారని అన్నారు, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 854 అడుగులు నీరు ఉండాలని జీవో చేశారు కానీ కోస్తా ప్రజలు ఆందోళన చేయడంతో జీవన రద్దుచేసి రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారు కానీ జాతీయ హోదాతో గుర్తింపు ఉండే పెద్ద ప్రాజెక్టు చేయలేదని గుర్తు చేశారు, గోరకల్లు రిజర్వాయర్ ను 60 నుంచి 70 టీఎంసీ కెపాసిటీ పెంచి ఉండి ఉంటే రాయలసీమలో నీటి కష్టాలు ఉండేవి కాదని అన్నారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అసంతృప్తితో రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు, కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు, పేదవాళ్లు  నలిగిపోతున్నారని అన్నారు. పేద ప్రజలకు సీఎం పదివేల రూపాయలు బటన్ నొక్కితే 20 వేల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల నుంచి లాక్కుంటున్నారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుకి ఏర్పాటు చేశారని మీరు ఉపయోగపడేది నెల్లూరు ప్రజలకు మాత్రమే అని గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నడుముల లోతు నీళ్లు కూడా లేవని రచ్చబండ తేలుతుందని బ్రహ్మంగారు చెప్పినట్టు పచ్చబండ తేలుతూ రాష్ట్ర ప్రజలకు అరిష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. శ్రీశైలం దేవస్థానంలో దోపిడీలు, తిరుపతి వెంకన్న స్వామి దేవస్థానంలో దోపిడీలు, వైసిపి నాయకులు దేవుళ్లను విడిచిపెట్టడం లేదు దేవుళ్ళ భూములను విడిచిపెట్టడం లేదని అన్నారు. నాయకులు అధికారులతో కుమ్మక్కయి ఆన్లైన్ రాజకీయాల చేస్తూ భూములను దోపిడీ చేస్తున్నారని, వీటినంతటిని ఎంక్వయిరీ చేసి ఎవరిని విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. హుసేనాపురం నుండి ఎం బాయ్ వెళ్లే రహదారిలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్, నర్సరీని స్థానిక నాయకులు ఆక్రమించుకొని బాగా వేశారని అడిగే నాధుడే కరువయ్యారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు ఏమి ప్రాజెక్టులు తెచ్చారని మీరే చెప్పమనండి అని తెలిపారు. ఉక్కు కర్మాగారం హడావుడి కి మాత్రమే శంకుస్థాపన చేస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రారంభించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు, నంద్యాల మార్కెట్ యార్డు చరిత్ర కలిగిందని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తున్నారని ,రాష్ట్రంలో లిక్కర్ పేరుతో కొత్త కొత్త బ్రాండ్లు సృష్టించి వేలకు వేల కోట్లు దండుకుంటున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని ఇలాంటి పిచ్చి బ్రాండ్లు బ్యాండ్ చేసి మంచి నాణ్యమైన లిక్కర్ను సప్లై చేయాలని సూచించారు. భూ దందాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు, భూ బకాసురుల మీద ఎంక్వయిరీ చేయించి ఎవరిని విడిచి పెట్టేది లేదని అన్నారు, అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు గురి అయ్యి ఇన్ని రోజులు కావస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని, వెలగమాను డ్యాము మా ప్రాణానికి పెద్ద పోలవరం డ్యామ్ అయిందని రెండు డాం పనులు పూర్తి అయ్యే దాఖలాలు లేవని అన్నారు. వీటి అన్నింటిపై 52 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని విశేష స్పందన వస్తుందని వచ్చే నెల జూన్లో చలో ఢిల్లీ కార్యక్రమంలో జై రాయలసీమ నినాదాన్ని గట్టిగా వినిపిస్తామని హెచ్చరించారు.

About Author