సూపర్ స్టార్ కు గవర్నర్ పదవి ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఇందుకోసం ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీకాంత్, ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న రజనీ.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన మరునాడే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవితో భేటీ కావడంతో పాటు, ఆయనతో రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్‌తో రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటంటూ కాంగ్రెస్, వామపక్షాలు రజనీపై దుమ్మెత్తిపోశాయి.