నడిచే పాము ఎక్కడైనా చూశారా ?
1 min readపల్లెవెలుగువెబ్: అలెన్ పాన్ అనే యూట్యూబర్‌కు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అలవాటు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ అందరి నోళ్లలో నానుతున్నాడు. అయితే ఇటీవల అతడికి వినూత్నమైన ఐడియా వచ్చింది. స్వతహాగా పాములంటే ఎంతో ఇష్టపడే అలెన్.. వాటి కోసం ఏదైనా చేయాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడు, పాములు నడిస్తే ఎలా వుంటుంది.. అని ఆలోచించాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చాడు. పొడవాటి ప్లాస్టిక్ గొట్టానికి నాలుగు రొబోటిక్ కాళ్లను ఏర్పాటు చేశాడు. కంప్యూటర్ ద్వారా దానిని నియంత్రించేలా ఏర్పాట్లు చేశాడు. ఓ చిన్న కొండచిలువను ఆ గొట్టంలోకి పంపించి తన పరికరం పనితీరును పరీక్షించాడు. అది విజయవంతం అవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “నాకు పాముల్ని చూసి జాలి వేసింది. అవి వాటి కాళ్లను పోగొట్టుకున్నాయి. ఎవరూ వాటిని వెతకలేదు. నేను వెతికాను. నేను స్నేక్ లవర్‌ని” అని అల్లెన్ తెలిపాడు.