కీచక ఉపాధ్యాయుడు బోజన్న ను ఉద్యోగం నుంచి తొలగించాలి
1 min read
విద్యాబోధనలు అందించాని మానవ మృగం
లైంగిక వేధింపులకు గురై ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
అగ్రహం తో వుగిపోయిన తల్లిదండ్రులు
కీచక ఉపాధ్యాయుని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి
సీఐ రామిరెడ్డి, ఎస్సై మధుసూదన్, పోలీస్ సిబ్బంది సర్ది చెప్పడంతో సర్దుమనిగిన ఆందోళన
ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి మండలం లోని ఏనుగుమర్రి గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోదించే బొజ్జన్న అనే ఒక ఉపాద్యాయుడు గత రెండు సంవత్సరాలు నుండి విద్యార్ధినుల పట్ల అసభ్యకర మైన పదజాలం వాడుతూ, యూట్యూబ్ వీడియోస్ చూపిస్తూ అమ్మాయిలను ముట్టకూడనిచోట తాకుతూ 9, 10 తరగతి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ తరగతి గదిలో తెల్లగ వున్నా అమ్మాయిలను ఒక పక్క, నల్లగా వున్నా అమ్మాయిలను ఒక పక్క మరియు కులాల వారీగా కూర్చోబెడుతూ అమ్మాయిలను చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్నారని, తెలిపారు. విసిగిపోయిన అమ్మాయిలు వాళ్ళ తల్లితండ్రులకు చెప్పగా బాలికల తల్లితండ్రులు గుంపులు గుంపులుగా చేరుకొని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేయాలనీ అనుకుంటే అతను రెండు రోజుల నుండి పాఠశాలకు రాకుండా దక్కున్నారని ఇలాంటి కిచక ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి ఇతనిపై ఫోక్స యాక్ట్ కింద కేసు పెట్టాలని విద్యార్థుల తల్లితండ్రులు పోలీసు అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్యాపిలి సిఐ రామిరెడ్డి, ఎస్ఐ మధుసూధన్ వారి సిబ్బంది తో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నా విద్యార్థిని తల్లిదండ్రులు కు వారు నచ్చచెప్పి ,విద్యార్థులతో విచారణ జరిపి విద్యార్థుల చేప్పినట్టు మాటా విని ఉపాధ్యాయుడు బోజన్న పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

