భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధ భయం కొనసాగుతున్నప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోలు మద్దతు లభించింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ యూఎస్ ఫ్యూచర్స్ మార్కెట్ ఇంట్రాడే కనిష్ఠం నుంచి రికవరీ సాధించడంతో దేశీయ సూచీలు అదే బాటలో సాగాయి. ఐటీ, రియాల్టీ, ఫార్మా స్టాక్స్ లో కొనుగోళ్ల కారణంగా సూచీలు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. చివరి గంటలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. సెన్సెక్స్ 581 పాయింట్ల లాభంతో 53424 పాయింట్ల వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 16013 వద్ద క్లోజ్ అయింది.