అంధకారంలో 4 వ వార్డు వీధులు…
1 min read
హోళగుంద, న్యూస్ నేడు: హోళగుంద మండలకేంద్రంలో 4 వ వార్డు వీధులు దాదాపు పదేళ్లుగా అంధకారంలోనే ఉన్నాయి.పది సంవత్సరాల క్రితం సుమారు 30 కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారు.అయితే ఈ వీధుల్లో విద్యుత్ సరఫరా లేక అక్కడి నివాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్క వీధిలో నుంచి విద్యుత్ తీగలు చెట్లు, కట్టెలకు కట్టి ఇండ్లలో విద్యుత్ సరఫరా చేసుకుంటున్నారు.అధికారులు గత 4 సంవత్సరాల క్రితం స్థంభాలు ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు ఆ స్తంభాలకు వీధి దీపాలు అమర్చలేదు.దీంతో స్థంభాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి.స్థంభాలు ఉన్నా ఆ స్తంభాలకు విద్యుత్ తీగలు లాగి వీధి దీపాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్ల్యక్షం ప్రదర్శిస్తున్నారని అక్కడి నివాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తంబాలకు విధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆ వీధి వాసులు అబ్దుల్ సుభాన్, తాహెర్, మహమ్మద్ తదితరులు కోరారు.
