ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికెత్తిన కేంద్రమంత్రి
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్.ఆర్.ఆర్’ దేశంలోనే అతి పెద్ద సినిమా. ఇప్పటి వరకూ రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా భారీ వసూళ్ళు దక్కించుకుంటుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలాగానే.. భారత ఆర్ధిక వ్యవస్థ కూడా మోడీ నాయకత్వంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది’ అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోయల్ వ్యాఖ్యలకు ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ ధన్యవాదాలు తెలియచేసింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని కూడా ట్వీట్ చేసింది.