స్కూల్ ఆయాల పని భారాన్ని తగ్గించాలి…
1 min read
ఆంధ్ర ప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్(APUSWU)
కర్నూలు, న్యూస్ నేడు: మార్చి 8th అంతర్జాతీయ మహిళా దినాన్ని సమున్నతంగా పాటిస్తూ వివిధ ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్నటువంటి మహిళలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ సందర్భంగా బహిర్గతం చేస్తూ నినదిస్తున్నారు… అందులో భాగంగానే కర్నూల్ నగరంలో వివిధ స్కూల్స్ లలో పని చేస్తున్నటువంటి స్కూల్ ఆయాలు వారికి ఇచ్చేటువంటి కనీసమైన 6000 జీతాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని, వారికి ఉన్నటువంటి పని భారాన్ని తగ్గించాలని అదేవిధంగా దేశంలో మహిళల పసిపిల్లల మీద పెరుగుతున్నటువంటి దాడులకి కారణమైన అశ్లీల సినిమా సాహిత్యాలను, ఇంటర్నెట్లో ఉన్నటువంటి పోర్న్ వెబ్ సైట్లను, మద్యం మాదకద్రవ్యాలను పూర్తిగా నిషేధించాలని! డిమాండ్ చేస్తూ కర్నూల్ నగరంలోని ఓల్డ్ టౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నినదించారు… ఈ సందర్భంగా స్కూల్ ఆయాల వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తేజోవతి మాట్లాడుతూ మహిళలు ఇంటా బయట అనేక వివక్షతలకు గురవుతున్నారని, వారికి సరైనటువంటి భద్రత లేదని, చట్టాలని సరిగా అమలు చేయడంతో పాటు సమాజంలో మహిళలపై పెరిగిపోతున్న నేరాలను అదుపు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని అన్నారు.