జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించాలి
1 min read
ప్రతి రోజు యోగా కు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: మే 22 నుండి జూన్ 21 వ తేది వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ నుండి యోగాంధ్ర క్యాంపెయిన్ అంశం పై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుండి జూన్ 21 వ తేది వరకు యోగాంధ్ర కార్యక్రమం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా ప్రతి రోజు యోగా కి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22 వరకు ప్రతి రోజు ఒక జిల్లాలో ఒక థీమ్ తో స్టేట్ ఈవెంట్ యోగా సెషన్ ను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.. అందులో భాగంగా జూన్ 17 వ తేదీన కర్నూలు జిల్లాలో 5 వేల మంది పారిశుధ్య కార్మికులతో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.అదే విధంగా జూన్ 8వ తేదీన కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్ లలోని 3 ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లతో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు..జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రతి కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు.యోగాకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్నారు..స్వయం సహాయక సంఘాలు , విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, రైతులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు.. రిజిస్ట్రేషన్ అయిన వారందరూ జూన్ 21 వ తేదీన యోగాలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.ట్రైనింగ్ లో భాగంగా ప్రతి గ్రామానికి ఒక ట్రైనర్ ఉండాలన్నారు. 500 వరకు గ్రామాలు ఉన్నాయని 500 మంది ట్రైనర్ లను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మే 24, 25 తేదీలలో మాస్టర్ ట్రైనర్లకి జిల్లాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.. మే 27 నుండి 31 వరకు మండల స్థాయిలో ట్రైనర్లకు శిక్షణ మే జరుగుతుందన్నారు.. గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జూన్ 3 వ తేది నుండి 18 వ తేది 3 ఫేజ్ లలో జరుగుతాయన్నారు.. శిక్షణ కార్యక్రమాలను డిఈవో, డిఎస్డివోలు నిర్వహిస్తారన్నారు… మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను ఎంపిడిఓ, మండల టీం లు నిర్వహిస్తారన్నారు… గ్రామ స్థాయిలో విలేజ్ టీం లు నిర్వహిస్తారన్నారు.. జూన్ 21వ తేది జాతీయ యోగ దినోత్సవం లో ప్రజలు ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు అనువైన వేదికను గుర్తించాలన్నారు.కర్నూలు నగరం లో ప్రతి రోజూ యోగా నిర్వహించేందుకు ఒక రోడ్డు ను గుర్తించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు ఆర్డీవో సందీప్, పత్తికొండ ఆర్డీఓ భరత్, అన్ని మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.