ఏపీ లో మతపరమైన పార్టీలకు తావులేదు
1 min read
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో పెరిగిన మతపరమైన దాడులు: ఎస్డిపిఐ
హొళగుంద, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మతపరమైన దాడులు పెరగడం ఇది బీజేపీ యొక్క అసలు నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన పార్టీలకు తావులేదు అయినప్పటికీ టిడిపి పార్టీతో భాగస్వామ్యంతో పోటీ చేయడం వలన బిజేపి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే స్థానాలు రావడం జరిగింది. నాటి నుండి బిజెపి ఆంధ్ర రాష్ట్రంలో తమ పట్టును నిలబెట్టుకోవడానికి ఈ విధమైనటువంటి మతపరమైన దాడులను ప్రేరేపిస్తూ ఆంధ్రప్రదేశ్ ను ఉత్తరాది రాష్ట్రాల వలె ప్రతినిత్యం మతపరమైన కలహాలను సృష్టించి తమ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కావున రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి తో భాగస్వామ్యాన్ని విడిచి ఎన్డీఏ కూటమి నుండి వైదొలగాలని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ నమ్మకాన్ని నిలబెట్టాలని తద్వారా రాబోయే ఎన్నికలలో టిడిపికి రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉండవచ్చు లేనిపక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం, మైనారిటీలు మరియు సెక్యులర్ వాదులు మీకు వ్యతిరేకిస్తారని రాబోయే 2029 ఎన్నికలలో మీకు తీరని నష్టం కలిగించే విధంగా మీకు వ్యతిరేకిస్తారని తెలియజేస్తూ గత అసెంబ్లీ సమావేశాలలో ఆదోని నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అసెంబ్లీ లో ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలను యస్ డిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది మరియ అసెంబ్లీ రికార్డుల నుండి ఆ వ్యాఖ్యలు వెంటనే తొలిగించాలి ఆలాగే యావత్ ముస్లిం సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని యస్ డిపి డిమాండ్ చేస్తుంది. రాయచోటిలో జరిగిన ఘటనపై ఎటువంటి విచారణ చేయకుండా రాజకీయనాయకులు అధికార దుర్వినియోగంతో సి.ఐ విఆర్ కు బదిలీ చేయడం న్యాయం కాదని వెంటనే సిఐ చంద్రశేకర్ ను విధులలో కొనసాగించాలని అనంతరం రాయచోటి సంఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మరియు ఇటువంటి మతపరమైన దాడులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రతను కాపాడాలని శాంతి యుత వాతావరణాన్ని నెలకొల్పాలని సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది అని యస్ డి పి ఐ రాష్ట్ర నాయకులు చాంద్ బాషా రాష్ట్ర ఉపాధ్యక్షులు, అబ్దుస్ సుఖాన్ రాష్ట్ర కార్యదర్శి. మహమ్మద్ తాహెర్ రాష్ట్ర కార్యదర్శి లు పత్రికా ముఖంగా ఎస్డిపిఐ కడప కార్యాలయం లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ పత్రిక సమావేశం లో కడప జిల్లా ఎస్డిపిఐ నేతలు జాబీర్ అలీ ఖాన్, అక్టర్ అలీ మరియు కడప జిల్లా జాయింట్ ఆక్షన్ కమిటీ కన్వినర్ సైయద్ అహ్మద్ బాషా (బాబు బై) తదితరులు పాల్గొన్నారు.