థర్డ్ వేవ్.. మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన మూడో దశ వ్యాప్తి మూడు వారాల్లో భారత్ లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. నగరాలతో మొదలై గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్బీఐ తాజా అంచనా. ముంబయిలో ఈనెల 7న 20,971 కొత్త కేసులు నమోదయ్యాయని, ఈ సీజన్లో ఇదే గరిష్ఠ స్థాయి అని నివేదిక పేర్కొంది. ముంబయిలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిన 23 వారాల్లో జాతీయ గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని నివేదక వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, జమ్మూకశ్మీర్, ఒడిశా, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అంధికంగా ఉందని నివేదకలో పేర్కొంది. కానీ రెండో దశ కరోనతో పోల్చితే ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గిందని పేర్కొంది.