NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుటుంబ పాల‌న చేసే వారే దేశ‌ద్రోహులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ వచ్చిన ప్రతీసారీ ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని.. ముందుగా బీజేపీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ఆయన విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. కుటుంబ పాలన ముగిసిన చోటే అభివృద్ధి జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు నా దృష్టికి వచ్చాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతిమయం. ఇక్కడి కుటుంబ పాలన అవినీతిమయం. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. ప్రజల మనస్సుల్లోంచి బీజేపీని తీసేయలేరని పేర్కొన్నారు. ఇక్కడి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. తెలంగాణ కోసం త్యాగాలు ఏ ఒక్క కుటుంబం కోసం చేసింది కాదు. తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుంది.. అది తథ్యం. కుటుంబ పాలన చేసేవారే దేశద్రోహులు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతుందని పేర్కొన్న ప్రధాని మోదీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడి ప్రజలు అది ఫిక్స్‌ అయిపోయారు అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

                          

About Author