కేసీ కెనాల్ లో తీవ్రమైన కాలుష్యం నివారణకు తగిన చర్యలు తీసుకొండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్ లో తీవ్రమైన కాలుష్యం నివారణకు తగిన చర్యలు తీసుకొని, శుభ్రపరచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగర అడిషనల్ కమీషనర్ కి వినతి పత్రం అందజేసిన SUCI (C) పార్టీఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రవహిస్తున్న కేసీ కాలువ ఇటీవల కాలంలో తీవ్రమైన కాలుష్యానికి గురవుతోందని తెలిపారు. కాలువ పక్కన నివసించే ప్రజలు గృహ, వాణిజ్య మలినాలను కాలువలో పడేయడం, చెత్తను పారవేయడం, కొన్ని మురికి కాలువలు కూడా కెసి కెనాల్ లో కలవడం వల్ల నీటి నాణ్యత పూర్తిగా తగ్గిపోయి, వీటి వల్ల పూర్తిగా కలుషితం అయ్యి, అనేక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ప్రజలకు దుర్వాసన, నీటి శుద్ధి సమస్యలు, డెంగీ, మలేరియా వంటి దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందడం, కాలువలో వాటర్ హైసింత్ మొక్కలు పెరిగి ప్రవాహాన్ని అడ్డుకోవడం, పక్కనున్న నివాసాలు,విద్యా సంస్థలు, వ్యాపార ప్రదేశాలు ఈ కాలుష్యానికి ప్రభావితమవుతున్నాయని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కెసి కెనాల్ లో ఉన్న చెత్తను తొలగించి, శుభ్రపరచాలి, చెత్త పారవేతపై నిబంధనలు అమలు చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, మురుగు నీటికి వేరుగా డ్రెయినేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం. తేజోవతి, పార్టీ సభ్యులు ఎం. నాగన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.