రాయలసీమలో తొలిసారిగా TOT శస్త్రచికిత్స
1 min read
మహిళల మూత్ర నియంత్రణ సమస్యకు శాశ్వత పరిష్కారం
కర్నూలు, న్యూస్ నేడు: స్ట్రెస్ యూరిన్ ఇన్‌కాంటినెన్స్ (Stress Urine Incontinence – SUI) అనేది అనేక మంది మహిళలను ఇబ్బంది పెట్టే సాధారణమైన కానీ జీవన నాణ్యతను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. దగ్గు, తుమ్ము, నవ్వు లేదా శారీరక శ్రమ సమయంలో తెలియకుండా మూత్రం కారిపోవడం ఈ సమస్య యొక్క ప్రధాన లక్షణం.ఈ సమస్యకు ఆధునిక వైద్య పరిష్కారంగా నిలిచే ట్రాన్స్ఒబ్ట్యూరేటర్ టేప్ (TOT) శస్త్రచికిత్సను రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో విజయవంతంగా నిర్వహించడం వైద్య రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.44 ఏళ్ల మహిళ ఒకరు గత మూడు సంవత్సరాలుగా స్ట్రెస్ యూరిన్ ఇన్‌కాంటినెన్స్ సమస్యతో బాధపడుతూ వచ్చారు. కీగెల్ వ్యాయామాలు, పలు చికిత్సలు చేసినప్పటికీ సమస్య తగ్గకపోవడంతో మెడికవర్ హాస్పిటల్స్‌ను సంప్రదించారు. డా. శిల్పా చౌదరి పర్యవేక్షణలో TOT శస్త్రచికిత్స చేయగా, శస్త్రచికిత్స అనంతరం మూత్ర లీకేజ్ పూర్తిగా తగ్గి, ఆమె సాధారణ జీవితానికి తిరిగి చేరుకున్నారు. ఈ అత్యాధునిక శస్త్రచికిత్సను డా. శిల్పా చౌదరి కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్, ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు విజయవంతంగా నిర్వహించారు.

