బదిలీలు … ప్రమోషన్ చట్టం ఏకపక్షం
1 min read
జీవో ఎంఎస్ నెంబర్ 117 రద్దు చేయడం వల్ల ఉపయోగం కంటే అపకారమే ఎక్కువ
వైయస్సార్ టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రతి శుక్రవారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో గత ఆరు నెలలుగా సమావేశాలు నెలకు నాలుగు సార్లు ఏర్పాటు చేసి సంఘ అభిప్రాయాలను పరిగణ లోనికి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఉపాధ్యాయ సంఘాలను అవమానించడమే అన్నారు.రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో అధికారులే ఉపాధ్యాయులకు సంవత్సరానికి సర్వీస్ పాయింట్లు ఒకటిగా నిర్ణయించారు. కానీ చట్టంగా మార్చేటప్పటికీ దానిని 0.5 గా మార్చడం జరిగింది. ఎక్కువమంది ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘాలన్నీ సర్వీస్ పాయింట్ సంవత్సరానికి ఒకటి కావాలని అడిగినప్పటికీ, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 0.5 కేటాయించటం చాలామంది విస్మయానికి గురయ్యారన్నరు. ఉపాధ్యాయులకు అన్యాయం చేసినట్లే పదోన్నతులైనా, ట్రాన్స్ఫర్స్ అయినా సీనియర్ ఉపాధ్యాయులకు మేలు కలిగే విధంగా ఉంటాయి. కానీ సదరు విషయం లో సీనియర్ ఉపాధ్యాయులకు చాలా అన్యాయం జరుగుతుంది.ఉపాధ్యాయ సంఘాలన్నీ రిటైర్మెంట్ కు మూడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ అధికారులు ఏకపక్షంగా రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 117 రద్దు ద్వారా స్కూల్ అసిస్టెంట్స్ దాదాపు పదివేల మంది మిగులుగా చూపబడతారు అలాంటప్పుడు ఇంకా ఎస్జీటీలకు పదోన్నతులు ఎక్కడ కల్పిస్తారని ప్రశ్నించారు. మోడల్ ప్రైమరీ స్కూల్ ల పేరుతో డ్రాఫ్ట్ కి విరుద్ధంగా అనేక ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడానికి రంగం సిద్ధమైంది. ఆ విధంగా చేయడం వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేయడమే కాకుండా భవిష్యత్తులో డీఎస్సీలో ఎస్జీటీ టీచర్ల నియామకం కనుమరుగవుతుంది. కొన్ని వేల ప్రాథమిక పాఠశాలలు రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎక్కువ ఫౌండేషన్ స్కూల్స్ అవడంవల్ల మరల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆర్భవిస్తాయి.జీవో ఎంఎస్ నెంబర్ 117 రద్దు చేయడం వల్ల ఉపయోగం కంటే అపకారమే ఎక్కువ జరుగుతుందన్నరు.అంతిమముగా ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటం ప్రాథమిక పాఠశాలను మూసివేయడం లక్ష్యంగా ఈ యాక్ట్ రూపొందించబడుతుందేమో అనే అనుమానాలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగెడ్డం సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు.