ఉదయభాను 10 కేసులు ఎత్తివేత..!
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై ఉన్న 10 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ కోసం ఏర్పటైన ప్రత్యేక న్యాయస్థానంలో ఈ పది కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నింటిని ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పిటిషన్ దాఖలు చేయించాలని డిజిపిని ఆదేశించింది.