PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా చ‌మురులో ఉక్రెయిన్ ర‌క్త‌పువాస‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యా చమురులో ఉక్రెయిన్ రక్తపు వాసన ఉందని, దానిని కొనవద్దని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. SWIFT నుంచి రష్యన్ బ్యాంకులను నిషేధించాలని కోరింది. యూరోపియన్ నౌకాశ్రయాలకు రష్యన్ నౌకలను అనుమతించరాదని, క్రిప్టోకరెన్సీకి రష్యాకు యాక్సెస్ ఇవ్వకూడదని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆదివారం టెలివైజ్డ్ మెసేజ్‌లో ఈ విజ్ఞప్తి చేశారు. యోధులైన ఉక్రెయిన్ ప్రజలు ప్రపంచానికి చాలా సరళమైన సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు. ‘‘రష్యన్లూ ఇంటికెళ్ళిపోండి. మీరు విదేశీ గడ్డపై ఉన్నారు. ఇక్కడ మీ అవసరం ఎవరికీ లేదు. మిమ్మల్ని పువ్వులతో స్వాగతించేవారెవరూ ఇక్కడ లేరు. ఉక్రెయిన్‌ను వదిలిపెట్టు పుతిన్’’ అని కోరుతున్నారని చెప్పారు.

                                       

About Author