నాటసార పై అవగాహన….
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నవోదయం టు పాయింట్ ఓ లో భాగంగా గుడుంబాయి తండా మరియు గుమితం తండాలలో నాటసార అవగాహన మరియు గ్రామసభ నిర్వహించడం జరిగింది నాటు సారాకు సంబంధించి నాటు సారావలన కలుగ అనర్థాల గురించి వివరించడం జరిగింది. తదుపరి నాటు సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వము యొక్క లక్ష్యాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని పలువురు ఆఫీసర్లు భావించారు ఇందులో భాగంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ కమిటీ గ్రామ ప్రజల యొక్క సహకారంతో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాలని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కర్నూలు శ్రీమతి పి శ్రీదేవి మరియు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కర్నూలు ఆర్ హనుమంతరావు మరియు జిల్లా ప్రొ హిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సిఐలు చంద్రహాస్,రాజేంద్రప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.