PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌చివాల‌య ఉద్యోగుల‌కు యూనిఫాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల‌కు యూనిఫాం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాల్లో 14 శాఖలకు చెందిన 1.34 లక్షల మంది ఉద్యోగులకు యూనిఫాం అందించాలని అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే యూనిఫాం క్లాత్‌ వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసినందున వాటిని నియోజకవర్గాల కేంద్రాల్లో పంపిణీ చేయాలని సూచించింది. మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లకు తప్ప మిగిలినవారందరికీ మూడు జతల యూనిఫారం అందించనున్నారు.

                                      

About Author