NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిజాతగిరి మహా గిరి ప్రదక్షిణ కరపత్రాన్ని ఆవిష్కరణ

1 min read

ధర్మకర్తలు మండలి చైర్మన్,ఈఓ,ఏసి  ఆర్.వి చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పారిజాతగిరి మహా గిరి ప్రదక్షిణ కరపత్రాన్ని ఆవిష్కరణ చేసిన ధర్మకర్తలు మండలి చైర్మన్, ఈఓ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో ఆరువ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఈరోజు  వేకువ జామున నాలుగు గంటల 30 నిమిషాలకు సుప్రభాతం సేవ ఆరాధన తీర్థ ప్రసాద గోష్టి బాల భోగ నివేదన అనంతరం భక్తులకి విశేషమైన అలంకరణలో దర్శనం కల్పించారు ఆలయ రవికుమార్ ఆచార్యులు ఉదయం 5 గంటల నుండి ఆలయ గిరి ప్రదక్షిణ మొదటి భాగంలో భూ వరస్వామి దర్శనం అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులు కంకణ దారణతో కాలినడకన ఏడుకొండలు గిరి ప్రదక్షణ చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈరోజు వేలాది వచ్చిన భక్తులకు అన్నదానం  అన్న ప్రసాద వితరణ  ఆలయం తరఫున అన్న ప్రసాదం జరిపించినారు(తోలి ఏకాదశి )సందర్బంగా ది 25-07-2026శనివారం ఉదయం 8-44నిషాలకు గిరి ప్రదక్షిణ మొదటి మార్గంలో భు వరాహస్వామి ఆలయం నుండి ఆలయం అర్చకులు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఈవో ఆర్.వి చందన అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు భక్తులు కోలాటం, వికాస తరంగిని, దాతలు, వాహన సేవ తో ఆలయకళ్యాణం ఉత్సవామూర్తులు తోగోవిందా నామస్మరణతో (మహాగిరి ప్రదక్షిణ )కార్యక్రమం వైభవం గా జరుగుతుంది అని తెలిపారు వేలాది భక్తులుకు భారీ అన్నప్రసాదం జరుగుతుంది తెలిపారు, ఈ పూజా కార్యక్రమం లో పాల్గొన్ని శ్రీస్వామి వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఈ పూజాకార్యక్రమములో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగ వీరాఘర్రావు, కొప్పుల నాగ సూరంద్ర, ఆరెపల్లి నాన్ని, మడ్డి ప్రసాద్,వడిగళ్ల కుమారి, ముప్పిడి భాను, మరియు అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బీన దత్తత్రేయ,పెరిచర్ల జగపతిరాజు, గొట్టుముక్కల భాస్కర్రాజు, వాసవి సాయి నగేష్,ధనరాజు,ఫణి,మొదలుగు వారు పాల్గొన్నారు అని తెలియజేస్తున్నారు ఈరోజు ఆలయం ఆదాయం పూజా టికెట్స్ ద్వారా ప్రసాదాలు, విరాళాలు, అన్నదానం విరాళాలు రూ మొత్తం 1,11,990=00వచ్చినట్లుతెలియజేసారు ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి చందన తెలిపారు.

About Author