రానున్న ఎన్నికల్లో అరాచక వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం తధ్యమం
1 min readఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి
టిడిపి తీర్థo పుచ్చుకున్న మాజీ కార్పొరేటర్
ప్రజల్లో బరోసానింపిన బడేటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఏలూరు నియోజకవర్గంలో లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది. బుధవారం ఏలూరు 46వ డివిజన్ ఏటిగట్టు ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేసి, ప్రజల్లో భరోసా నింపారు. ఈ సందర్భంగా ప్రతిచోట బడేటి చంటికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ, హారతులు పడుతూ, తిలకాలు దిద్దుతూ అఖండ స్వాగతం పలికారు. ప్రజలందరినీ అప్యాయంగా పలకరించిన బడేటి చంటి,, సామాన్యులతో సామాన్యునిగా కలిసిపోయే నేతగా, ప్రతీ ఒక్కరిలో కూటమిపై విశ్వాసం నింపేవిధంగా యాత్రను కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు ఏరియాలో రోజువారీ పనులు సాగిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న సామాన్యులు అధికంగా ఉన్నారని అన్నారు. ఈ ప్రాంతం టిడిపికి కంచుకోటన్నారు. చేతకాని సాకులతో సంక్షేమాలను సామాన్యులకు దూరం చేస్తే, అర్హులు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి కనీస స్పందన కరువైందన్నారు. ఆశయం కోసం ఏకమైన కూటమి విజయావశ్యకతను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రజా చైతన్యంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కాగా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వ కొనసాగుతుంది. రోజురోజుకు చేరికలు జోరందుకోవడంతో ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ నెలకొంటోంది. తాజాగా ఏలూరు 21వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాదు రాధాబాబు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. పవర్ పేట పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటూ పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి మల్లెపు రాము,డివిజన్ ఇన్చార్జి యిదుపిల్లి రామ్ లక్ష్మణ్, శ్రీను, మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.