16న ‘ఉప్పలదడియ’లో ఉరుసు..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ సుల్తాన్ షా ఖాద్రి షర్పీ స్వాముల వారి ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గురువులు సుల్తాన్ షా ఖాద్రి బుధవారం తెలిపారు.ఈనెల 15వ తేదీ గంధం,16వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఉరుసు జెండాలు ఎక్కించడం జరుగుతుందని అదేవిధంగా 17వ తేదీ జియారత్ గురు సమాధి దర్శనం సాయంత్రం మూడు గంటలకు కిస్తీలు బహు వినోదముగా జరుగుతాయని రాత్రి 10 గంటలకు సత్సంగం జరుగుతాయని గురువులు తెలిపారు.భక్తాదులు ఈ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.